మందమర్రి ఏరియాలోని శాంతిగని గని ఆవరణ, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఈ వర్షం కారణంగా సింగరేణి కార్మికులు విధులకు హాజరు కావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గని ఆవరణతో పాటు దుర్గాదేవి ఆలయం సమీపంలోకి కూడా వర్షపు నీరు చేరింది. సమీపంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.