కార్తీక పౌర్ణమి సందర్భంగా మందమర్రిలోని అంగడి బజార్ శివకేశవ ఆలయంలో బుధవారం వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ శివునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. మహిళలు దీపాలు వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయాలు సందడిగా మారాయి.