సింగరేణి యాజమాన్యం కార్మికుల వైద్యసేవల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఏరియా జీఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. గురువారం మందమర్రిలోని కేకే వన్ డిస్పెన్సరీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సెంటర్ కార్మికులకు, పదవీ విరమణ చేసిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని, అవసరమైతే దీనిని మరింత ఆధునీకరిస్తామని తెలిపారు.