మందమర్రి పాత బస్ స్టాండ్ నుండి మంచిర్యాల వెళ్లే జాతీయ రహదారిపై ఆవులు సంచరిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నేషనల్ హైవే సిబ్బంది ఉన్నప్పటికీ, రోడ్డుపై ఉన్న ఆవులను తరిమేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆవులు, పశువుల కారణంగా పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ, నేషనల్ హైవే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.