మందమర్రి: పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలి

1చూసినవారు
మందమర్రి: పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలి
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మందమర్రి మండలంలోని రైస్ మిల్లులు, సారంగపల్లి, పొన్నారం గ్రామాలలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, దిగుమతి, సి ఎం ఆర్ ప్రక్రియలను ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్