బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ తెలిపారు. బుధవారం మందమర్రి జీఎం కార్యాలయంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వివరించారు. గత సమావేశంలో జరిగిన పనుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.