సింగరేణి ప్రభావిత గ్రామ కార్మిక కుటుంబాల పిల్లలకు ఉచిత వోల్వో డంపు ట్రక్ ఆపరేటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ తెలిపారు. ఈ శిక్షణకు పదవ తరగతి ఉత్తీర్ణులై, భారీ మోటర్ వాహన డ్రైవింగ్ లైసెన్స్‌తో మూడు ఏళ్ల అనుభవం ఉండాలని సూచించారు. మొదటి విడతగా ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు 18 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.