మందమర్రి: గెలుపునకు సమిష్టిగా కృషి చేయాలి

1చూసినవారు
మందమర్రి పట్టణంలోని బి1 క్యాంప్ కార్యాలయంలో బుధవారం మంత్రి వివేక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో విజయం సాధించడానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్