సింగరేణిలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కార్మికులు, ఉద్యోగులందరూ సహకరించాలని మందమర్రి జియం రాధాకృష్ణ తెలిపారు. నవంబర్ నెల మందమర్రి ఏరియా బొగ్గు ఉత్పత్తి వివరాలను విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. సంస్థ కార్మికులకు, ఉద్యోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, వారు కూడా 8 గంటల పని దినాలను సద్వినియోగం చేసుకొని రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలని ఆయన కోరారు.