మందమర్రి మండలం బురదగూడెం, అందుగుల పేట జాతీయ రహదారిపై సోమవారం రాంగ్ రూట్లో వస్తున్న 25 బైకులను సీజ్ చేసినట్లు సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆ బైకులను మంచిర్యాల ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. వాహన చోదకులు రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తూ నిబంధనలు పాటించాలని, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన సూచించారు.