చెన్నూర్ నియోజకవర్గంలో ఆదివారం మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ పర్యటించనున్నారు. కోటపల్లి లోని పౌరసరఫరా గోదాంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ అందజేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓఆర్ నీటి విడుదల ప్లాంట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మున్సిపాలిటీలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ అందజేయనున్నారు. ఆర్టీసీ ఐదు నూతన బస్సులను ప్రారంభించనున్నారు.