మంత్రి వివేక్ పిలుపు: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం

506చూసినవారు
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం, షాపు యజమానులను స్వచ్ఛందంగా బంద్ చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లతో బిల్లు పాస్ చేసిందని తెలిపారు. షెడ్యూల్ 9 ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉదయం చెన్నూరు మున్సిపాలిటీలో మంత్రి వివేక్ తెలంగాణ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్