మందమర్రి పోలీసులు రోడ్డు భద్రతకు ఆటంకం కలిగించే రాంగ్ రూట్ వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టారు. నాలుగు రోజులుగా బురదగూడెం, అందుగులపేట జాతీయ రహదారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను మంచిర్యాల ఆర్.టి.ఒ కార్యాలయానికి పంపించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి హెచ్చరించారు. రాంగ్ రూట్ ప్రయాణాన్ని ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.