పీఆర్‌పీ బకాయిలు వెంటనే చెల్లించాలి

852చూసినవారు
పీఆర్‌పీ బకాయిలు వెంటనే చెల్లించాలి
మందమర్రిలో సింగరేణి అధికారుల సంఘం పిలుపు మేరకు రెండో రోజు రిలే నిరాహార దీక్షమంగళవారం చేపట్టారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీ బకాయిలు, పే అప్‌గ్రేడేషన్, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, పదోన్నతులు, బదిలీల్లో పారదర్శకత వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులు కోరుతున్నారు. నెల రోజులుగా నిరసనలు జరుగుతున్నా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించడం లేదని, డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్