అనుమతులు లేకుండా ఇష్టారీతిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపి, పి. ఎం. పి క్లినిక్ లపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన రామకృష్ణాపూర్ లో మాట్లాడుతూ జిల్లా వైద్యాధికార పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది ఆర్ఎంపీలు ఇష్టా రీతిన వైద్యం చేస్తున్నారని విమర్శించారు.