రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దె రాగడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీమా సుధాకర్ (65) మృతి చెందారు. దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాలై, మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శుక్రవారం ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.