రామకృష్ణాపూర్ ఆర్క్ వన్ ఏ గని సమీపంలో సారలమ్మకు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న జాతరలో ఆదివాసీల ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీఎం తెలిపారు.