రామకృష్ణాపూర్: తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలి

547చూసినవారు
రామకృష్ణపూర్ లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్ట పెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న కోర్టు స్టేను రద్దు చేసి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ ఐక్యవేదిక పిలుపునిచ్చిన రాష్ట్ర బంధును జయప్రదం చేయాలని, ఈ బంద్ లో వర్తక సంఘాలు, కుల సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్