మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, జాతీయ ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం జరిగింది. కోటపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, సబ్ ఇన్స్పెక్టర్ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు, యువత, స్థానికులు పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడంలో ప్రతి పౌరుడి పాత్రపై అధికారులు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువత దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.