అమరవీరులను స్మరించి... నివాళులు అర్పించి...

0చూసినవారు
రామకృష్ణాపూర్: రామాలయం చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, రామాలయం యూత్ ఆర్గనైజేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అమరవీరులకు పూలమాలలు, క్యాండిల్స్ వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ జనరల్ సెక్రెటరీ దండు సదానందం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ఉద్యమ సమయంలో రామాలయం ఆధ్వర్యంలో "జై తెలంగాణ" నినాదంతో స్టిక్కర్లు వేసి ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్