
సోదరిని పెళ్లి చేసుకున్నాడని యువకుడి హత్య
ఏపీలోని గుంటూరు ఏటుకూరు రోడ్డులో మంగళవారం దారుణ హత్య జరిగింది. తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్న గణేశ్‌ను యువతి సోదరుడు, మరో ఇద్దరితో కలిసి దారుణంగా హత్య చేశాడు. పలకలూరుకు చెందిన యువతిని గణేశ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భయంతో రక్షణ కోసం గతంలో పోలీసులను ఆశ్రయించినప్పటికీ, చివరికి హత్యకు గురయ్యాడు.




