రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు డాక్టర్లు విక్రమ్, నరేష్, మధుకర్, శ్రీ రామ్ మైత్రి, అనస్థీషియా డాక్టర్లు, మరియు ఓటి విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో ఒక రోగికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ అత్యంత నైపుణ్యంతో కూడిన శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.