నర్సరీ లోని మొక్కలను సంరక్షించాలని డిఆర్డిఓ కిషన్ సూచించారు. వేమనపల్లి మండలంలోని కేతనపల్లి, ముల్కలపేట, నీల్వాయి గ్రామాల్లోని నర్సరీలను శనివారం ఆయన పరిశీలించారు. మొక్కల పెంపకం సంరక్షణపై పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా అటవీ ప్రాంతంలో నిర్మాణ పనులను పరిశీలించారు. జాబ్ కార్డు కలిగిన కూలీలందరూ వంద రోజులు పని పూర్తి చేసుకోవాలని సూచించారు.