మందమర్రి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో రేబిస్ వ్యాధిపై రైతులకు, పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కల్పించారు. పశు వైద్యాధికారి డా. తిరుపతి మాట్లాడుతూ, ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ జ్ఞాపకార్థం సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టీకా అందుబాటులో ఉన్నా, అవగాహన, నిర్లక్ష్యం కారణంగా ప్రతి సంవత్సరం 59,000 మంది రేబిస్ తో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.