
సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు: 29 మందికి లక్కీ డ్రా
మందమర్రి సి.ఈ.ఆర్ క్లబ్లో మంగళవారం సింగరేణి ఎన్సీడబ్ల్యుఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కౌన్సిలింగ్ జరిగింది. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి పరిధిలోని 112 క్వార్టర్లకు 200 మంది దరఖాస్తు చేసుకోగా, పారదర్శకంగా 29 మందికి కేటాయించారు. సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్ ఈ వివరాలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, ఓఎస్ రాజలింగు పాల్గొన్నారు.





































