Jan 21, 2026, 02:01 IST/
అనారోగ్యంతో చికిత్స పొందుతూ సర్పంచ్ మృతి
Jan 21, 2026, 02:01 IST
TG: ఖమ్మం (D) కారేపల్లి (M) బోటితండాలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గ్రామ సర్పంచ్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బోటితండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య తులసిరామ్(45)ను ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయగా ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకున్నారు. అనారోగ్యం కారణంగా అతను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.