ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలోని శివాలయంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీని పగులగొట్టి అందులోని కానుకలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఎత్తుకెళ్లిన నగదు, కానుకల వివరాలు తెలియాల్సి ఉంది.