
మంచిర్యాల: క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ దీపక్ కుమార్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోటీలను జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మంగళవారం ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు ఎంతో ముఖ్యమని, మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటమి గెలుపుకు పునాదని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




































