బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

1చూసినవారు
మంచిర్యాల పట్టణంలో బుధవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు అయినా బీసీలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత లేదని, దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు అగ్రకులాల వారిచేత పాలించబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు జరుగుతున్నా, ఏ పార్టీ కూడా న్యాయమైన వాటాను కల్పించలేదని, ఇది బీసీ సమాజం పట్ల వివక్ష అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉండాలంటే జనాభాకు తగ్గ వాటా ఉండాలని, ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :