మంచిర్యాల: వెంకటేష్ దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్

1274చూసినవారు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో గజ్జి వెంకటేష్ @ స్వామి (40) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామకృష్ణాపూర్ ఎస్సై J. శ్రీధర్ నేతృత్వంలోని రెండు బృందాలు నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. కుర్మపల్లి ఫ్లై ఓవర్ వద్ద నిందితుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైం నెం.124/2026, సెక్షన్ 103(1), 351(2) BNS కింద కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్