రిమ్స్ బాధిత కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.. రాజ్ కిరణ్

1చూసినవారు
రిమ్స్ బాధిత కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.. రాజ్ కిరణ్
ఆదిలాబాద్ రిమ్స్ ఘటనలో బిడ్డను కోల్పోయిన కూరం సేకు బాయి-దినేష్ దంపతులను మంచిర్యాల జిల్లాలోని వారి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్ బుధవారం  పరామర్శించారు. ఈ ఘటన బాధాకరమని, పిల్లల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్క చిత్రు, మండల అధ్యక్షులు మడవి కోసేరావ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్