మాదిగల హక్కుల కోసం మరో ఉద్యమ శంఖారావం - ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ

0చూసినవారు
మాదిగల హక్కుల కోసం మరో ఉద్యమ శంఖారావం - ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ
మంచిర్యాల జిల్లా నర్సూరు మండల ప్రెస్ క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి లింగంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో బచ్చల రమేష్ అధ్యక్షుడిగా, గుంపుల స్వామి అధికార ప్రతినిధిగా, కాంపెల్లి విజయ్, రామగిరి రాకేష్ ప్రధాన కార్యదర్శులుగా, పొట్ట రవి, లింగమూర్తి జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులను సీనియర్ నాయకులు శాలువాలతో సన్మానించి అభినందించారు. మాదిగల హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్