
ఉద్యోగం వదిలి పాలవ్యాపారం.. నెలకు లక్షన్నర ఆదాయం
TG: కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం కేశనపల్లికి చెందిన పెగుడ రాజేందర్, తండ్రి మరణానంతరం కుటుంబ భారాన్ని మోస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. AI ప్రభావంతో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోవడాన్ని చూసిన రాజేందర్ తన కాళ్ళపై సొంతంగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఊరిబాట పట్టాడు. రెండు బర్రెలతో పాల వ్యాపారం ప్రారంభించి, నేడు 20 పశువులతో నెలకు లక్షన్నర ఆదాయం సంపాదిస్తున్నాడు. తన 'రాజన్న డెయిరీ ఫార్మ్' ద్వారా ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ, నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.




