మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య కళాశాల విద్యార్థులకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం, జిల్లాలో ఆరోగ్య సేవలు, ప్రైవేటు ఆసుపత్రుల సేవలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ నాయక్ ప్రారంభించారు. గ్రామ, మున్సిపల్ పరిధిలో అందిస్తున్న వైద్య సేవల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, హెల్త్ ఎడ్యుకేటర్ రషీద్, సిబ్బంది శ్రీనివాస్,
విద్యార్థులు పాల్గొన్నారు.