మంచిర్యాల పట్టణంలో బుధవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ మార్పు కోసం, బీసీల చైతన్యం కోసం అనేక మంది బీసీ మహనీయులు వారి జీవితాలను సమాజానికి అంకితం చేశారని, వారి విగ్రహాలను పెట్టడంలో, వారి జీవితాలను పాఠ్యంశాల్లో చేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని అవలంబిస్తున్నాయని ఆరోపించారు. బీసీలుగా వారి త్యాగాలను సమాజానికి, భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన భాద్యత మనపై ఎంతైనా ఉందన్నారు. వారి పేర్లతో మన కాలనీలకు పేర్లు పెట్టడంతో వాళ్ళను స్మరించుకున్నవాళ్ళము అవుతామని బీసీ సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు.