నస్పూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, బీఆర్ఎస్ పార్టీ జెండా పతాకను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివాకర్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు.