అల్గునూర్ వంతెనపై కారు దగ్ధం

1చూసినవారు
అల్గునూర్ వంతెనపై కారు దగ్ధం
శనివారం హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు కారులో బయలుదేరిన శ్రీరాంరెడ్డి, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కరీంనగర్ అల్గునూర్ వంతెనపైకి చేరుకోగానే కారు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వారందరూ వెంటనే దిగి ప్రాణాలను రక్షించుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఇంజిన్ వేడెక్కి మంటలు వచ్చి ఉండవచ్చు. ఈ ఘటనతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్