
దారుణం.. భార్య గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేసిన భర్త
AP: నెల్లూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న భార్య నందినిని ఆమె భర్త శ్రీహరి శనివారం ఉదయం రిసీవ్ చేసుకున్నాడు. అనంతరం మార్గమధ్యలో వెళుతుండగా కత్తితో గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేశాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో గత 9 నెలలుగా వీళ్లు విడిగా ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో జరిగింది.




