కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీలు నెరవేర్చలేదు

1చూసినవారు
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీలు నెరవేర్చలేదు
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో, 'కామారెడ్డి బీసీ డిక్లరేషన్'లో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, దీనిపై అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి, బీఆర్ఎస్ పార్టీని కోరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా బీసీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్