ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు కాంగ్రెస్ నాయకుల నూతన సంవత్సర శుభాకాంక్షలు

0చూసినవారు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు కాంగ్రెస్ నాయకుల నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను జన్నారం మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు గురువారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, సయ్యద్ ఇసాక్, బొంతల మల్లేష్, నందు నాయక్, అల్లం రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్