దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నారు. శనివారం 595 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి వసతి, నీడ కోసం టెంట్లు, క్యూలైన్ల ఏర్పాటు వంటి అన్ని సౌకర్యాలను ఆలయ కార్యనిర్వాహక అధికారి సంకటనాల శ్రీనివాస్, పూజారులు, ఆలయ సిబ్బంది కల్పించారు.