దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు దండపల్లి ఎస్సై తహశీద్దున్ మంగళవారం తెలిపారు. మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన లక్కాకుల సృజన్ ను అదే గ్రామానికి చెందిన కళ్లెం సంతోష్ కర్రతో దాడి చేయడంతో అతని తలకు తీవ్రగయాలయ్యాయని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య మోరానికి సంబంధించిన డబ్బులు విషయంలో గొడవ జరిగిందన్నారు. సంతోష్ తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లయితే తెలిపారు.