దండేపల్లి: గూడెం సత్యదేవుని సన్నిధికి పోటెత్తిన భక్తులు,

5చూసినవారు
దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుండి దర్శనాలు, పూజలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి, గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి, స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్