కడెం కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని రైతులు అదే పడవొద్దని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ భరోసానిచ్చారు. దండేపల్లి మండలంలోని నాగసముద్రం, మాకులపేట గ్రామాల్లో వరి చేలను గురువారం పరిశీలించారు. రైతులు కడెం నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. పంటల స్థితిగతులపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.