దండేపల్లి: ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

70చూసినవారు
దండేపల్లి: ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని డిఆర్డిఓ కిషన్ అన్నారు. దండేపల్లి మండల కేంద్రంతో పాటు లింగాపూర్, నాగసముద్రం, మామిడిపల్లి, నెల్కి వెంకటాపూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. వాతావరణ పరిస్థితిల దృష్ట్యా కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. కేంద్రాల వద్ద సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్