పెద్దపల్లి
లో జరిగిన శుభకార్యానికి వెళ్లి మంచిర్యాలకు తిరిగి వస్తున్న కారు ఇందారం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇంటర్ పూర్తి చేసిన 18 ఏళ్ల సుశీల్ ఆదివారం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. కుమారుడి మృతదేహంపై పడి తల్లి పద్మ రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. కారు నడుపుతున్న తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.