మంచిర్యాల పట్టణంలో సోమవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని బీసీ కుల సంఘాలు, మేధావులు, వాదులు విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శాఖ పూరి బిమ్ సేన్, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.