సింగరేణిలో కీలక విభాగాల బాధ్యతలు డైరెక్టర్లకు అప్పగింత

3చూసినవారు
సింగరేణిలో కీలక విభాగాల బాధ్యతలు డైరెక్టర్లకు అప్పగింత
మంచిర్యాల జిల్లాలోని సింగరేణి సంస్థలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు డైరెక్టర్లకు కీలక విభాగాల బాధ్యతలను శనివారం అప్పగించారు. డైరెక్టర్ వెంకటేశ్వర్లుకు ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌తో పాటు శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి, ఆర్‌-3, ఏపీఏ, భూపాలపల్లి ఏరియాలు, కార్పొరేట్‌ ప్లానింగ్‌, ఈ అండ్‌ పీఎం, ఎక్స్‌ప్లోరేషన్‌, సర్వే, ఆర్‌ అండ్‌ డీ వంటి విభాగాల బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలపై ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఉత్పత్తి, ప్రాజెక్టులు, భద్రత, పరిపాలనపై మరింత దృష్టి సారించేందుకు దోహదపడుతుందని అసోసియేషన్‌ తెలిపింది.

సంబంధిత పోస్ట్