జన్నారం మండలంలోని గాంధీనగర్‌లో కోతుల బెడదతో విసిగిపోయిన గ్రామస్థులకు ఉపశమనం కలిగించేందుకు 11వ వార్డు మెంబర్ ముడుగు ప్రవీణ్ ఒక వినూత్న పద్ధతిని అవలంబించారు. కోతుల ఆగడాలను అరికట్టేందుకు, ఆయన ఒక వ్యక్తితో ఎలుగుబంటి వేషం వేయించి గ్రామంలో తిప్పారు. ఈ వింత దృశ్యం చూసి, నిజమైన ఎలుగుబంటి అని భ్రమపడిన కోతులు భయంతో గ్రామాన్ని వదిలి పారిపోయాయి. ఈ చర్యతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.