మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన కొత్తపెళ్లి నాగరాజ్, ఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడు. కంపెనీ యజమాన్యాలు ప్రతి సంవత్సరం సిబ్బందిని ప్రోత్సహించడానికి విదేశీ పర్యటనలకు పంపుతుంటాయి. ఈ క్రమంలో, 4 రోజుల క్రితం ఐఎఫ్ఎల్ ఫై హాయ్ ట్రిప్‌లో భాగంగా దుబాయ్ వెళ్లిన నాగరాజ్, దుబాయ్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో విమానాలు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయాడు. దుబాయ్ విమానయాన శాఖ ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు విమానాలు నడవవు. ఈ పరిస్థితుల్లో స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు పరిస్థితులు అనుకూలిస్తాయో, ఎప్పుడు ఇండియాకు తిరిగి వస్తాడోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.